12.5 C
New York
Tuesday, October 20, 2026

Buy now

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ…నవంబర్‌ 3న పోలింగ్‌.. 5న ఓట్ల లెక్కింపు

అమరావతి, విశ్వవిహారి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 27న అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌తో రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर