15 C
New York
Sunday, October 18, 2026

Buy now

భారత్‌ నిరసనలపై అమెరికా ఆందోళన…

భారత్‌ నిరసనలపై అమెరికా ఆందోళన

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను కోరుతూ జరుగుతున్న నిరసనలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యలను ప్రస్తావించాలని ఆరుగురు అమెరికా డెమోక్రటిక్‌ చట్టసభ సభ్యులు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కోరారు.రూబియో భారత్‌ పర్యటన నేపథ్యంలో ప్రమీలా జయపాల్‌, ఇల్హాన్‌ ఒమర్‌, జిమ్‌ మెక్‌గవర్న్‌, రషీదా త్లాయిబ్‌, ఎలియనోర్‌ హోమ్స్‌ నార్టన్‌, జీసస్‌ గార్సియా ఆయనకు లేఖ రాశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా భద్రతా బలగాలు మితిమీరిన బలప్రయోగం, అక్రమ నిర్బంధానికి పాల్పడుతున్నాయన్న ఆందోళనలను లేఖలో ప్రస్తావించారు. ఈ అంశాలను భారత అధికారులతో చర్చించాలని రూబియోకు విజ్ఞప్తి చేశారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను కోరుతూ చేపట్టిన ప్రదర్శనలను చట్టసభ సభ్యులు ఉదహరించారు. నిరసనకారులను పర్యవేక్షించేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం, ఇతర అమెరికా నగరాల్లోని కాన్సులేట్‌లు ఫొటోగ్రాఫర్లను నియమించాయన్న ఆరోపణలను కూడా లేఖలో ప్రస్తావించారు. భారత ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారన్న అంశంపైనా ప్రమీలా జయపాల్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. రూబియో పర్యటనలో ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर