15 C
New York
Sunday, October 18, 2026

Buy now

ధర్మవరంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ .. మౌలిక సదుపాయాలు కల్పించాలి….ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి….నిబంధనలు కచ్చితంగా పాటించాలి…..అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ధర్మవరం విశ్వ విహారి ….. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాట్లను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ శనివారం పరిశీలించారు.ధర్మవరంలోని బీఎస్‌ఆర్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు, ప్రతిపాదకులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.కేంద్రాల వద్ద నీడ, తాగునీరు, క్యూలైన్లు, బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాల్లోనే నామినేషన్లు సమర్పించేలా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణలో జాప్యం లేకుండా ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर