32 మంది అభ్యర్థుల ప్రకటన….22 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు

తాడేపల్లి విశ్వవిహారి: స్థానిక సంస్థల ఎన్నికల బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో 32 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. గతంలో రెండు జాబితాలను ప్రకటించిన పార్టీ తాజాగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభ్యర్థులను ఖరారు చేసింది.మూడో జాబితాలో 22 మున్సిపాలిటీలకు, 10 నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించింది. మున్సిపాలిటీల్లో పార్వతీపురం నుంచి సంగంరెడ్డి లక్ష్మీపార్వతి, పిఠాపురం నుంచి పెదపాటి రాజేష్, నరసాపురం నుంచి కావలి రమాసీత, మార్కాపురం నుంచి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, చిలకలూరిపేట నుంచి షేక్ కరీమూన్, మాచర్ల నుంచి షేక్ సుల్తానా, పిడుగురాళ్ల నుంచి షేక్ అబ్దుల్లా, సత్తెనపల్లి నుంచి షేక్ నాగూర్ మీరాన్, వినుకొండ నుంచి పఠాన్ సలేహా ఖాన్, రేపల్లె నుంచి చిమట లక్ష్మిని ఎంపిక చేసింది.వెంకటగిరి నుంచి బొలిగాల దీవన, ఆత్మకూరు (నెల్లూరు) నుంచి అల్లారెడ్డి ఇందుమతి, రాజంపేట నుంచి గండికోట రేష్మా, రాయచోటి నుంచి జిన్నా షరీఫ్, ఆళ్లగడ్డ నుంచి కె. షరీఫా బీ, నందికొట్కూరు నుంచి షేక్ ఫాతిమాబీ, గుంతకల్లు నుంచి గాది లింగేశ్వరబాబు, రాయదుర్గం నుంచి పొరెళ్ల శివకుమార్, తాడిపత్రి నుంచి ఫయాజ్ బాషా, ధర్మవరం నుంచి కాచెర్ల ఆంజనేయులు, కదిరి నుంచి అత్తార్ పర్వీన్, నగరి నుంచి ఈవీ బాలకృష్ణన్ను అభ్యర్థులుగా ప్రకటించింది.నగర పంచాయతీల్లో నెల్లిమర్ల నుంచి సముద్రప్పు రామారావు, ఆకివీడు నుంచి మన్నె లలితాదేవి, తిరువూరు నుంచి పరస శ్రీనివాసరావు, దాచేపల్లి నుంచి కొప్పుల రవికుమార్, ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు సుజాత, ఆత్మకూరు (కర్నూలు) నుంచి డాక్టర్ ఎ. ప్రియాంక బాయి, గూడూరు (కర్నూలు) నుంచి ఎల్. పద్మావతి, మడకశిర నుంచి ఈ. ఓంకార్, పెనుకొండ నుంచి వాల్మీకి కె. శ్రీనివాసులు, పుట్టపర్తి నుంచి వనం అవినాష్ను ఎంపిక చేసింది.
