10.8 C
New York
Saturday, October 17, 2026

Buy now

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

కంపెనీ అధికారులకు ముందే ఈమెయిల్అ…..పార్ట్‌మెంట్‌లో విగతజీవులుగా గుర్తింపు

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం…..కారణాలపై పోలీసుల దర్యాప్తు

గురుగ్రామ్‌: హరియాణాలోని గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్యను హత్య చేసి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్‌లో దంపతులు మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గురుగ్రామ్‌ సెక్టార్‌ 68లోని ఎం3ఎం మెరీనా అపార్ట్‌మెంట్‌లో అక్టోబరు 15న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన మొహమ్మద్‌ అస్లాం (30), కేరళకు చెందిన ఫర్హానా (28) కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరు అక్కడే నివాసముంటున్నారు. అస్లాం సెక్టార్‌ 58లోని ఓ సమాచార సాంకేతిక సంస్థలో పనిచేస్తుండగా, ఫర్హానా గృహిణి.ఘటన జరిగిన రోజు ఉదయం అస్లాం తన సంస్థలోని ఉన్నతాధికారులకు ఈమెయిల్‌ పంపాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని, ఈ విషయాన్ని తన తండ్రికి, ఇంటి యజమానికి తెలియజేయాలని అందులో పేర్కొన్నాడు. దీంతో అప్రమత్తమైన సంస్థ అధికారులు అపార్ట్‌మెంట్‌ యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా, ఫర్హానా నేలపై మృతిచెంది కనిపించింది. మరో గదిలో అస్లాం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అక్కడి నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. భార్యను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం అస్లాం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. దంపతుల మధ్య గొడవలకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर